భారత్ పాక్ సంబంధాల్లో కొత్త అధ్యాయం పీఎం

పాకిస్థాన్ : భారత్ పాకిస్థాన్ సంబంధాల్లో నూతన అధ్యాయం ఆరంభమైందని భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. మాల్దీవుల్లో జరుగుతున్న సార్క్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పాక్ ప్రధాని గిలానీతో మన్మోహన్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ భారత్, పాక్ సంబంధాలలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. పాక్ ప్రధానితో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఇరు దేశాలు స్వేఛ్చా వాణిజ్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి యూసప్ రజా గిలానీని శాంతిదూతగా మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. సరికొత్త అధ్యాయం లిఖించడానికి ఇదే సరైన సమయం. రెండు దేశాల చరిత్రలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu