బీరువా (రివ్యూ)

 

సందీప్‌ కిషన్‌, సురభి జంటగా కణ్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్‌ ఫిలిమ్స్, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘బీరువా’ రివ్యూ ఇది... అల్లరి పిల్లాడైన సంజు (సందీప్ కిషన్)కి చిన్నప్పటి నుంచి బీరువా ఫ్రెండ్. తండ్రి కొట్టబోయినా బీరువాలోనే దాక్కుంటాడు. అలా అతనికీ బీరువాకి ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. అయితే అది ఒకే బీరువా కాదు. ఏ బీరువా అయినా అతనికి ఫ్రెండే. ఒక సందర్భంలో ఫ్రెండ్స్ వల్ల సందీప్ తండ్రి 40 కోట్లు నష్టపోతాడు. హీరోయిన్ సురభి తండ్రి అయిన ఎంపీని ఆశ్రయించి ఆ 40 కోట్లు తిరిగి వసూలు చేసుకుంటాడు. ఈ సందర్భంలో సురభిని చూసి లవ్వులో పడిపోయిన సందీప్ కిషన్ ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇదిలా వుంటే అజయ్ ఒక వర్ధమాన రాజకీయ నాయకుడు. ఎంపీ కూతుర్ని కనుక పెళ్ళి చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చని తన ప్లాన్స్‌లో తాను వుంటాడు. ఈ నేపథ్యంలో కథ   మలుపులు తిరిగి ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత అజయ్ మనుషులు సందీప్ కిషన్‌ వెంట పడుతూ వుంటారు. వారి నుంచి సందీప్ కిషన్ తప్పించుకునే ఛేజ్‌లు గట్రాయే ఈ సినిమా సెకండాఫ్. సెకండాఫ్‌లో అనేక సందర్భాలలో సందీప్ కిషన్ని బీరువాలే కాపాడుతూ వుంటాయి. కామెడీ బాగానే వుంది. సందీప్ కిషన్ తెగ నటించేశాడు. హీరోయిన్ సురభి బాగుంది. మొత్తమ్మీద  టైంపాస్ సినిమా ‘బీరువా’.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu