ఇంటిదొంగను పట్టించిన సిసికెమేరా
posted on Jul 16, 2012 10:49AM
ఓ ఇంటిదొంగను సిసికెమేరా పట్టిచ్చింది. దీంతో విశాఖ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.కోటి 48లక్షల 99వేలు రికవరీ అయింది. అలానే బ్యాంకులోనే పని చేస్తున్న ఉద్యోగి దఫదఫాలుగా చేసిన దొంగతనమూ బయటపడిరది. గత నెల 29వ తేదీన బ్యాంకులో కోటి 48లక్షల 99వేల రూపాయలు గల్లంతైందని బ్యాంకు అధికారులు తెలుసుకున్నారు. తెలుసుకున్న వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీస్‌కమిషనర్ పూర్ణచంద్రరావు రంగంలోకి దిగారు. పోలీసులు ఉద్యోగుల ద్వారా ముందస్తుగా వివరణలు తీసుకున్నారు. ఆ తరువాత ఎలా గల్లంతయిందని అధికారులను ప్రశ్నించారు. లాకులు యథాతథంగా ఉన్నా ఆ డబ్బు తగ్గిపోయిందని వారు వివరించారు.
దీంతో పోలీసులు బ్యాంకులోని సిబ్బందే ఈ పని చేసి ఉంటారని గుర్తించారు. బ్యాంకులో సిసికెమేరాల పనితీరును పరిశీలిస్తామని బ్యాంకు అధికారుల అనుమతిని తీసుకున్న పోలీసులు సిసికెమేరాఫుటేజీ టేపును పూర్తిగా పరిశీలించారు. విచారణలో భాగంగా పరిశీలిస్తుంటే ఒక ఉద్యోగి అనుమానాస్పందంగా పలుమార్లు వెళుతున్న తీరు బయటపడిరది. సిసికెమేరా ఫుటేజీలో ఒకసారి అతను దొంగతనం చేసినది రికార్డు కూడా అయింది. దీంతో పోలీసులు చొరవ చూపి ఆ బ్యాంకు ఉద్యోగి అభయానంద్‌పాశ్వాస్‌ను విచారించారు. అతనే దొంగతనం చేశాడని నిర్ధారణ అయింది. పలుదఫాలుగా ఈ దొంగతనం జరిగిందని ఆ డబ్బును కూడా వేరే ఉరులో ఉన్న తన మిత్రుడి ఇంట్లో దాచానని పాశ్వాస్ ఒప్పుకున్నాడు. వేగంగా రికవరీ చేసి ఈ మిష్టరీ చేధించినందుకు బ్యాంకు సిబ్బంది పోలీసులను అభినందించారు.