బండి విమర్శలు గీత దాటుతున్నాయా? 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ‘సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్’ ను ఒక మంత్రంలా జపిస్తారు. ప్రభుత్వం, పార్టీ అనిసరించే విధానంగా బీజేపీ నాయకులు చెప్పుకుంటారు. మోడీ, అమిత్ షాలే కాదు, పార్టీ సాధారణ కార్యకర్తలు కూడా అదే మంత్రం జపిస్తారు. అయితే, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం, మోడీ మంత్రానికి అర్థాన్నే మార్చేశారు. రాష్ట్రంలో అయన సాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో అయన చేసిన ప్రసంగంలో  ‘తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని మోడీ, అమిత్ షా తనను పంపినట్లు చెప్పారు. హిందువుల పండగల విషయంలో ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అయినా, ప్రధాని మోడీ తనను హిందూ సమజాన్ని సంఘటితం చేసేందుకు పంపారని చెప్పుకోవడం విమర్శలకు అవకాశం కలిపించేలా ఉందని అంటున్నారు. 

నిజానికి  బండి సంజయ్ ఇపంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సరి కాదు, హైదరాబాద్ పాత బస్తీలోని భాగ్య లక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభించిన సమయంలోనే ఆయన మాట జారారు. ఇక అప్పటి నుంచి, ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూనే ఉన్నారు. ఒక దశలో బీజేపీ హిందువుల  పార్టీ అనే వరకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ రోజు మళ్ళీ ఇంచుమించుగా అదే మాట అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టె వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమో పార్టీ పెద్దలలు ఆలోచించాలని, పార్టీలో కొందరు సూచిస్తున్నారు. కాగా,బండి సంజయ్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ ఇమేజిని దెబ్బ తీస్తునాయనే విమర్శలు సైతం వినవస్తున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరితో ఒకరు పోటీ పడి తమ పరవు తామే తీసుకుంటున్నారని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకుల మాటలకు న్యాయస్థానాలు ఆంక్షలు విధించే పరిస్థితి రావడం శోచనీయమని సామాన్య ప్రజలు సైతం విచారం వ్యక్త పరుస్తున్నారు. 

అదలా ఉంటే బండి సంజయ్  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చేసిన వ్యాఖ్యలు, అధికారుల పనితీరుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు, అధికార పార్టీ ఇతర పార్టీల నాయకులను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు గురించి చేసిన వ్యాఖ్యలు , విమర్శలు వాస్థవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయని విశ్లేషకులు కితాబు నిస్తున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు. విమర్శించ వలసిందే. అందులో రెండవ అభిప్రాయానికి తావు లేదు. నిజానికి, తెరాస ప్రభుత్వంలో  సమస్యలకు కొదవ లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉంది.. శాంతి భద్రతల పరిసతి అయితే చెప్పనే అక్కర లేదు. నిరుద్యోగ సమస్య, ఆత్మ హత్యలు ఇలా అనేఅక్ సమస్యలు ఉన్నాయి. సమస్యల ఆధారంగా పోరాటం చేయడం ఎంత అవసరమో .. అసలు సమస్యలు పక్కదారి  పట్టిపోయేలా వ్యక్తీగత విమర్శలు చేయడం, భావోద్వేగాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయడం అంతే హానికరం అంటున్నారు, సామాన్యులు

Related Segment News