హైకోర్టు లాయర్ల హత్య కేసును ఎన్‌కౌంటర్‌తో సరిపెడతారా.. బండి సంజయ్ సూటి ప్రశ్న

తెలంగాణాలో నిన్న హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను నడిరోడ్డు మీద పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వామన్‌రావు తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై మండి పడ్డారు. న్యాయవాదుల హత్య ప్రభుత్వ హత్యేనని ఆయ‌న‌ ఆరోపించారు. పథకం ప్రకారమే న్యాయ‌వాద‌ దంపతులను చంపేశార‌ని, అంతేకాకుండా ఈ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజలు తిరగబడతారని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎన్‌కౌంటర్ చేయడమా ద్వారా కేసు పక్కదారి పట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచార‌ణ‌‌ జరిపిన తరువాతే చర్యలు తీసుకోవాలని అయన టిఆర్ఎస్ సర్కార్ ను డిమాండ్ చేసారు. ఈ హ‌త్యల‌ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ వెంటనే ‌ స్పందించాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. టీఆర్ఎస్ నేతలు ఈ దారుణం పై ఎందుకు స్పందించడం లేదని అయన నిల‌దీశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu