బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు

 

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై బండి సంజయ్ కూడా స్పందించారు. సిట్ విచారణకు హాజరవుతానని తెలిపారు.  మొదట జూలై 17న సిట్ నుంచి నోటీసుల అందుకున్న కేంద్ర మంత్రి జూలై 24న విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ముందే ఫిక్స్‌ అధికారిక కార్యక్రమాల వల్ల విచారణకు హాజరుకావడం లేదని విచారణ అధికారులకు సమాచారం అందజేశారు.

మరోవైపు భార్యభర్తల బెడ్ రూమ్‌లో మాటలను ట్యాప్ చేయడాన్ని బీజేపీ అధిష్టానం ఇప్పటికే సీరియస్‌గా పరిగణిస్తోంది. అదేవిధంగా కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ , కేటీఆర్ పాత్రపై ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. అధినేత చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ అంగీకరిండం, డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం‌పై జాతీయ స్థాయిలో చర్చకు కమలం పార్టీ సిద్ధమవుతున్నట్లుగా టాక్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu