నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ వద్ద : సీఎం రేవంత్
posted on Jun 8, 2025 4:29PM
.webp)
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అజాత శత్రువు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ దగ్గర అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకలావేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ బయోగ్రఫీ పుస్తకం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్ వరకు ఎదిగారు. సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.
పేదలు చేసుకునే చిన్న చిన్న వేడుకల్లో ఆయన భాగం అయ్యేవారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. జాతీయ రాజకీయాల్లో వాజ్‌పేయీకి ఉన్న గౌరవం.. రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉంది. ఆయన నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. ఆయన శైలి, విధానాల నుంచి నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే వారు నేర్చుకోవాలి. జంటనగరాల్లో కష్టం వస్తే ప్రజలకు గుర్తుకు వచ్చే నాయకులు పీజేఆర్, దత్తాత్రేయ. తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్ కోసం మాకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారు. మా నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుంది’’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.