రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి : సీపీఐ నారాయణ
posted on Jun 21, 2025 6:47PM

బనకచర్ల ప్రాజెక్ట్ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ నేత నారాయణ కొరారు. బనకచర్ల ప్రాజెక్టు కంటే ముందు హంద్రీనీవా, వంశీధర లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాని ఆయన తెలిపారు. వెనకబడిన ప్రాంతాలకు నీరు అందేలా కృషి చేయాలని అన్నారు. ఎవరికీ నష్టం లేకుండా ప్రభుత్వాలు చూడాలని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం సహాయం తీసుకోవాలని ఆయన తెలిపారు.
కొంతమంది ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నారాయణ ఆరొపించారు.రాష్ట్రాలు రెండుగా విడిపోయాయిన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు శత్రువులు కాదని ఆయన హితవు పలికారు. ఎవరికి నష్టం లేని పద్ధతిలో పరిష్కారం చేసుకుంటే మంచిదని పేర్కొన్నారు.ఈనెల 23న తెలంగాణ క్యాబినేట్ సమావేశం ఉంది. అందులో చర్చించి, ఆ తర్వాత నేనే ఒకడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రీ ఫీజిబులిటి రిపోర్ట్ (పీఎ్‌ఫఆర్) ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పీఎ్‌ఫఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదని నారాయణ తెలిపారు.