తొలి టెస్టులో భారత్ ఆలౌట్..ఇంగ్లండ్ ఎదుట భారీ స్కోర్
posted on Jun 21, 2025 7:02PM

ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది. జైస్వాల్ (101), కేఎల్ రాహుల్ (42), శుభ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) పరుగులు చేయగా..ఏడేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ నిరాశపర్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (11), శార్దూల్ ఠాకూర్ (1) నిరాశపర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.