భగవద్గీత కేసు గెలిచిన రష్యా హిందువులు
posted on Dec 29, 2011 8:26AM
మాస్
కో: భగవద్గీతపై నిషేధం విధించాలని కోరుతూ సైబేరియా కోర్టులో వేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన రష్యాలోని హిందువులు విజయం సాధించారు. ఉగ్రవాద సాహిత్యంగా ముద్ర వేసి భగవద్గీతను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సైబేరియా కోర్టు బుధవారం తోసిపుచ్చింది. సైబేరియాలోని టోమ్‌స్క్ కోర్టు దానిపై తుది విచారణ చేపట్టింది. స్టేట్ ప్రాసిక్యూటర్ వాదనలను, హిందువుల ప్రతిస్పందనను విన్న జడ్జి పిటిషన్‌ను సమీక్షించి, భగవద్దీతను నిషేధించాలనే విజ్ఞప్తిని తోసిపుచ్చారు. స్టేట్ ప్రాసిక్యూటర్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందని ఇస్కోన్ రష్యా యూనిట్ నాయకుడు సాధు ప్రియ దాస్ చెప్పారు. జూన్ నుంచి కేసు టోమ్స్‌క్ కోర్టులో నడుస్తోంది. నిషేధం విధించకుండా రష్యాతో దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని రష్యాలోని హిందువులు భారత ప్రభుత్వాన్ని కోరారు. భారత ప్రభుత్వం, మాస్కోలోని భారత దౌత్య కార్యాలయం విషయాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి.