నీచ టీచర్‌కి చెప్పుదెబ్బలు
posted on Dec 10, 2014 2:13PM

గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెదపరిమి గా్రమంలో సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజేశ్వరరావుకు గ్రామస్థులు చెప్పుదెబ్బలతో సత్కారం చేశారు. రాజేశ్వరరావు ఈ పాఠశాలలో గత 20 సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతను విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కొంతమందిని బెదిరించి లోబరుచుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాఠశాల కరెస్పాండెంట్ విద్యార్థినుల నుంచి సమగ్రంగా సమాచారాన్ని సేకరించి, గ్రామస్థులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. దాంతో గ్రామస్థులు బుధవారం ఉదయం రాజేశ్వరరావును చెప్పులతో కొట్టి స్కూలు నుంచి పంపించేశారు. రాజేశ్వరరావుకు సహకరించిన మరో కాంట్రాక్టు తెలుగు ఉపాధ్యాయుడు రాఘవకు కూడా గ్రామస్థులు దేహశుద్ధి చేశాడు. ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వరరావు ఆరు నెలల సెలవు మీద వెళ్ళినట్టు తెలుస్తోంది.