మోడీ సహకారం మరువలేనిది-బాబు
posted on Oct 22, 2015 2:44PM

అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీకి చంద్రబాబునాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నీటి తెచ్చి ఇచ్చి అమరావతి నిర్మాణానికి తన సహకారం ఉంటుందని ప్రకటించిన మోదీకి బాబు ధన్యవాదాలు తెలిపారు, ప్రధాని నేతృత్వంలో అమరావతిలో ప్రజారాజధానిని నిర్మిస్తామన్న చంద్రబాబు... ప్రధాని ఇప్పటికే చాలా సహాయం చేశారని అన్నారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి పోలవరం ప్రాజెక్టుకు మోడీ సహకరించారని, అంతేకాకుండా వెనుకబడిన జిల్లాలకు సహాయం చేశారని, ప్రాజెక్టులు అందించారని చంద్రబాబు చెప్పారు. కేంద్రం అందిస్తున్న సహకారానికి ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్ సింగపూర్ కు, నిర్మాణంలో సహకారం అందిస్తున్న జపాన్ కు చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.