ఒకడే ఒక్కడు మెనగాడు... దేశం మెచ్చిన నాయకుడు

రాజ‌కీయ చ‌రిత్ర‌లో చాలామంది నాయ‌కుల‌ను గురించి తెలుసుకుని వుంటాం, కొంద‌రిని చూసి వుంటాం. మ‌రి కొంద‌రి గురించి చ‌దివి వుంటాం. ఇంకొందరి గురించి విని ఉంటాం. నాయ‌క‌త్వ ప‌టిమ కేవ‌లం పార్టీ వ‌ర్గీయులు, అనుచ‌రుల బాగోగులు మాత్రమే చూసుకునే వారు కాదు. నాయ‌కుడు అంటే త‌న చుట్టూ వున్న‌వారిని స‌మానంగా చూడ‌గ‌ల‌గాలి.

అంద‌రికీ  చేయ‌గ‌లిగేవాడే నాయకుడు. కేవ‌లం రాజ‌కీయ స‌మ‌స్య‌లే కాకుండా సామాజిక స‌మ‌స్య‌లు, వూహించ‌ని ప్ర‌కృతి బీభ‌త్స స‌మ‌యాల్లోనూ ఎంతో స‌మ‌య‌ స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి అధిక స్థాయిలో న‌ష్టాలు జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌ల్ని ప్ర‌భుత్వ ఆస్తుల‌నూ కాపాడ‌గ‌లిగే చ‌తుర‌త‌, తెలివి తేట‌లు, ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించ‌గ‌లిగిన‌వాడే నిజ‌మైన నాయ‌కుడు అనిపించుకుంటాడు. ఇటీవ‌లి కాలంలో అంత‌టి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టిడిపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే అని జనం అంటున్నారు.

ఎందుకంటే ఆయన ప్రజలు కష్టాల్లో ఉంటే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సహాయం చేయడానికి రంగంలోకి దిగిపోతారు.. పార్టీ శ్రేణులనూ సమాయత్తం చేస్తారు. అలాంటి అస‌లు సిస‌లు నాయ‌క‌త్వ  ప‌టిమ ఆయ‌న‌లోనే చూడ‌గ‌ల్గుతు న్నాం. 

ప్ర‌జ‌లు ఎప్పుడు   స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నా ముందుగా స్పందించే నేత‌గా చంద్ర‌బాబుని  నిలబడటం చాలా కాలం నుంచీ గ‌మ‌నిస్తూనే వున్నాం.  చీపురుప‌ల్లి మండ‌లం పుర్రేయ‌వ‌ల‌స జంక్ష‌న్‌లో శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌రిగ్గా ఆ స‌మ‌యంలో చీపురుప‌ల్లిలో  రోడ్డు షో ముగించుకుని అటువేపు వ‌స్తూ ఆయ‌న వాహ‌నం దిగి క్ష‌త‌గాత్రుల‌ను  త‌న కాన్వా య్ లోని ఆంబులెన్స్‌లోనే విజ‌య‌న‌గ‌రం త‌ర‌లించారు. శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు తీవ్ర‌గాయాలై రోడ్డ‌మీద ప‌డిపోయారు. అది చూసిన‌వారు వెంట‌నే 108 వాహ‌నానికి స‌మాచారం అంద‌జేశారు. కానీ వాహ‌నం రావ‌డం అల‌స్య‌మ‌యింది. ఇంత‌లో ఆ దారిగుండా విశాఖ విమానాశ్ర‌మానికి వెళుతూన్న చంద్ర‌బాబు వారికి వెంట‌నే స‌హాయం చేసి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu