మోడీ పీఎంగా అనర్హుడు..నన్ను ప్రధానమంత్రి చేయండి.. ఆజంఖాన్

ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా అనర్హుడని.. తాను రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రిగా ఉండాలంటూ లక్నలో పోస్టర్లు వచ్చిన నేపథ్యంలో.. ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు  ''మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను. దానికి అన్నివిధాలా అర్హుడిని.. అందుకే ఉపముఖ్యమంత్రి కావాలంటూ వెలిసిన పోస్టర్లను తీయించేశాను' అని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఎంపీలంతా తనను ఎన్నుకోవాలని.. అది దేశానికి  మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని, దేశం ప్రతిరోజూ పురోగతి సాధిస్తుందని చెప్పుకున్నారు. ప్రధాని పదవికి తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా తనకే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరి అజాంఖాన్ వ్యాఖ్యలకు ఎలాంటి దూమారం లేపుతాయో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu