కాల్ మనీ.. వైసీపీ లీడర్సే ఎక్కువ..
posted on Dec 16, 2015 5:09PM
.jpg)
ఏపీలో కాల్ మనీ దందా చేసిన అరాచకాలు తవ్వేకొద్ది బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎంతోమంది పార్టీ నేతలు బయటపడుతున్నారు.. ఎంతోమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకూ అరెస్ట్ అయిన వారిని బట్టి చూస్తే అందరికంటే వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు మొత్తం 80 మందిని పైగా అరెస్ట్ చేస్తే అందులో 27 మంది వైసీపీ నేతలు ఉండగా.. ముగ్గురు సీపీఐ నేతలు.. 44 మంది ఏ పార్టీకి చెందని వారు ఉన్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ పై విమర్సలు చేసిన జగన్ పై .. ఆ పార్టీ నేతలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాల్ మనీ కేసులో టీడీపీ నేతలు వైసీపీ నేతలను విమర్శించారు.. ఇప్పుడు అరెస్ట్ అయిన వారిలో వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు.. వైసీపీ నేతలకు టీడీపీని విమర్శించే అర్హత లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంక వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అయితే వారికంటే ఎక్కువగానే మాట్లాడుతూ సీఎం అంటేనే కాల్ మనీ అంటూ రెచ్చిపోయారు. అంతేకాదు ఈ విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం.. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై రచ్చ చేయాలని డిసైడ్ అయ్యారు జగన్. మరి ఇప్పుడు నోరు మొదుపుతారో లేదో చూడాలి.