‘అవును-2’ షార్ట్ రివ్యూ
posted on Apr 3, 2015 11:58AM

రవిబాబు తీసిన అవును సినిమా హిట్టయ్యింది. ఇప్పుడు ఆ సినిమా రెండో భాగం ఆవును-2 తీశాడు. ఇంతకీ ఈ పార్ట్ 2 ఎలా ఉందో చూద్దాం. అవునులో భయపెట్టిన రవిబాబు అవును-2లో భయపెట్టాడా లేదా ఓ లుక్ వేద్దాం.
యామిని(పూర్ణ) హర్ష (హర్షవర్థన్ రాణె) ప్రేమించి పెళ్లి చేసుకొని... ఊరవతల ఓ టౌన్ షిప్‌లో కాపురం పెడతారు. అక్కడ కెప్టెన్ రాజు (రవిబాబు) ఆత్మ తిరుగుతుంటుంది. యామిని కన్యత్వాన్ని అనుభవించాలని రకరకాల ప్రయాత్నాలు చేస్తుంది. చివరికి హర్ష శరీరంలోకి ప్రవేశిస్తుంది. కెప్టెన్ రాజు ఆత్మ ఆవహించిన హర్షని కత్తితో పొడుస్తుంది యామిని. హర్ష ఆసుపత్రి పాలవుతాడు. ఇక్కడికి 'అవును' పార్ట్ 1 పూర్తయింది. ఇప్పుడు పార్ట్ 2... హర్ష, యామిని ఇల్లు మారతారు. ఆ ఇంటిని వెతుక్కొంటూ ఆత్మ వచ్చేస్తుంది. మళ్లీ యామినిని వశపరుచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాల్ని యామిని ఎంత వరకూ తిప్పికొట్టింది. కెప్టెన్ రాజు ఆత్మ చివరికి ఏమైంది? అనేదే పార్ట్ 2 స్టోరీ
స్థూలంగా చూస్తే పార్ట్ 1కీ, పార్ట్ 2కీ పెద్ద తేడా లేదు. హీరో హీరోయిన్లు ఇల్లు మారారు. పక్కింటివాళ్ల గొడవ మారింది. అంతే తేడా. అవును తీసినంత గ్రిప్పింగ్ గా పార్ట్ 2 మలచలేకపోయాడు రవిబాబు.
అవునులో కొన్ని ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఉంటాయి. కెప్టెన్ రాజు అనేవాడెవడో చివరి వరకూ తెలీదు. అవును 2లో అలాంటి ఇంట్రస్ట్రింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో బోర్ కొట్టిస్తుంది. దెయ్యం గొడవే అనుకొంటే.. దానికి మాయలూ మంత్రాల విద్య తెలుసన్నట్టు.. ట్యాబ్స్, సెల్ ఫోన్స్ ఆపరేటింగ్ వచ్చు అన్నట్టు చూపించి ఇంకాస్త చిరాకు తెప్పించాడు.
సాంకేతికంగా రవిబాబు సినిమాలెప్పుడూ బాగుంటాయి. కానీ ఈసినిమాలో అంత ఛాన్స్ లేదు. మరీ ముఖ్యంగా శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం ఘోరంగా ఉంది. అరుపులూ, కేకలతో చిరాకు తెప్పించాడు. కెమెరా అంతా ఒక ఇంట్లోనే తిప్పాడు దర్శకుడు. దాంతో లొకేషన్ మారక.. బుర్ర తిరిగిపోతుంది. రవిబాబు డైలాగుల్లో ఒకట్రెండు డబుల్ మీనింగులు దొర్లాయి. దర్శకుడిగా, స్ర్కీన్ ప్లే రైటర్‌గా రవిబాబు ఈసినిమాలో దారుణంగా విఫలమయ్యాడు. అవును లో చూపించిందే అవును 2లోనూ చూపించి దీనికి సీక్వెల్ అని పేరెందుకు పెట్టాడో మరి. కనీసం అవును సినిమాలో ప్రతీ సీన్ రెండు సార్లు చూపించి.. ఇదే అవును 2 అన్నా బాగుండేదేమో...?