ఆ ఇంటి నిండా పాములే పాములు

 

ఈ పేరు చెబితేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా ఓ యాభై పైన పాములని, అదీ ఒక ఇంట్లో ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం సాదుల్ నగర్ గ్రామంలో కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి మాచునూర్ కృష్ట అనే వ్యక్తి ఇంట్లో దాదాపు 56 పాములు బయటపడ్డాయి. కృష్ణ, అతని కుటుంబసభ్యులు ఇంట్లో పడుకొన్న సమయంలో నాలుగు పిల్ల పాములు దుస్తుల కిందకు దూరాయి. అది గమనించిన కృష్ణ వాటిని చంపేశాడు. మరి కొద్దిసేపటికి మరో నాలుగు పాములు బయటకు వచ్చాయి. అతను వాటిని కూడా చంపేశాడు. అయితే ఇంట్లోకి పాము పిల్లలు ఇంటి గడప కింద నుంచి రావడాన్ని గమనించి అక్కడ తవ్వగా ఏకంగా పాముల గుంపే బయటపడింది. దీంతో భయపడిన కృష్ణ గ్రామస్థుల సహాయంతో వాటిని చంపేశాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu