సీబీఐ విచారణకు ముందు విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి శనివారం (జనవరి 28,2023) సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇందుకోసం హైదరాబాద్ చేరుకున్న ఆయన సీబీఐ విచారణ కోసం ఆ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లడానికి ముందు ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు.  లోటస్ పాండ్ లో విజయమ్మను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం ఆమెతో కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడారు  అనంతరం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి  బయలుదేరి వెళ్లారు. వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో సీబీఐ నోటీసుల మేరకు అవినాశ్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అంతకు ముందు  లోటస్ పాండ్ కు వెళ్లి  సీఎం జగన్ తల్లి విజయమ్మతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.