సభ మొదటి వాయిదా షురూ
posted on Jan 30, 2014 9:05AM
.jpg)
ఊహించినట్లుగానే ఈరోజు శాసనసభ సమావేశమవగానే ఆంధ్ర తెలంగాణా సభ్యుల నినాదాలతో దద్దరిల్లిపోయింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ విజయమ్మ తదితరులు సమైక్య తీర్మానం కోసం ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బహుశః ఈరోజు సాయంత్రం వరకు సభలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చును. అయితే, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు ప్రకారం సభలో టీ-బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకే నిశ్చయించుకొన్నారు గనుక, దానిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణా సభ్యులను బయటకి తరలించేందుకు అదనపు పోలీసు బలగాలను రప్పించి సిద్దంగా ఉంచారు. ఈ రోజే టీ-బిల్లుకి ఆఖరి రోజు గనుక, తెలంగాణా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసి బహుశః సాయంత్రంలోగా ఆయన సభలో బిల్లుపై ఓటింగ్ నిర్వహించవచ్చును.