టి.టి.డి. ఇ.ఓ.గా దొండపాటి సాంబశివరావు
posted on Dec 11, 2014 2:50PM

తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులవుతారన్న ఉత్కంఠకి తెరపడింది. టీడీడీ ఇ.ఓ.గా సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ దొండపాటి సాంబశివరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దొండపాటి సాంబశివరావు ఉడా ఛైర్మన్‌గా సమర్థనీయంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రతిభకు మరింత గుర్తింపు తెచ్చే టీటీడీ ఇ.ఓ. బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దొండపాటి సాంబశివరావు స్వస్థలం కృష్ణాజిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి. దొండపాటి సాంబశివరావును టీడీడీ ఇ.ఓ.గా బదిలీ చేయడంతోపాటు ఏపీ ప్రభుత్వం మరికొందరు ఐఎఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శిగా ఎ.గిరిధర్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా అజయ్ జైన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా సునీతకు అదనపు బాద్యతలు అప్పగించారు. గుల్జార్, ఎంజీ గోపాల్‌లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన విభాగాలను సంప్రదించాలని వారిని ప్రభుత్వం ఆదేశించింది.