కేసీఆర్‌కు అసదుద్దీన్ సూచనలు
posted on May 23, 2014 10:57AM
.jpg)
టీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ ఎల్పీ నేత కేసీఆర్‌ను అసదుద్దీన్, మజ్లిస్ ఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్‌జాఫ్రిలు కలిసి గంటపాటు చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఏర్పడనున్న తొలి ప్రభుత్వానికి తాము బయటనుంచే సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసిఆర్ కు పలు సూచనలు చేసినట్లు ఒవైసీ తెలిపారు. ప్రభుత్వ లోగోలో చార్మినార్‌ను చేర్చాలని.. ఉర్దూను అధికార భాషగా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరెంట్, నీటి సమస్యలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా... కృష్ణా మూడో దశను పూర్తిచేసి, గోదావరి జలాలను నగరానికి తరలించాలన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం ప్రత్యేకంగా పవర్ ప్లాంట్‌ను నెలకొల్పాలని సూచించినట్లు తెలిపారు.