ఆర్థికాభివృద్ధి కోసమే వడ్డీరేట్లు తగ్గించాం- అరుణ్‌ జైట్లీ

ప్రభుత్వం పీపీఎఫ్‌, కిసాన్ వికాస పత్ర వంటి పొదుపు పథకాలన్నింటి మీదా గత వారం వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే! మనుపు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) మీద 8.7 శాతం వడ్డీ లభిస్తుండగా దాన్ని ఏకంగా 8.1 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 8.7% ఉన్న కిసాన్‌ వికాస పత్రాల మీద వడ్డీ ఇప్పడు 7.8%గా మిగిలింది. పోస్టాఫీసుకి సంబంధించిన పొదుపు పథకాలన్నింటి మీదా వడ్డీలు ఇలాగే తగ్గుముఖం పట్టాయి.

ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి మనుషుల ఆశల మీద ప్రభుత్వం నీరు చల్లిందంటూ విపక్షాలు మండిపడ్డాయి. ‘కష్టపడి జీవించే మధ్యతరగతి జీవుల మీద ప్రభుత్వం దారుణానికి ఒడిగట్టిందంటూ’ రాహుల్‌ గాంధి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కానీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనకేసుకు వచ్చారు. మార్కెట్‌కు అనుగుణంగానే వడ్డీరేట్లలో మార్పులు చేస్తూంటామని ఆయన చెప్పుకొచ్చారు. మార్కెట్లో రుణాల వడ్డీ తక్కువగా ఉంటే, పొదుపు రేట్లు అంతకంటే ఎక్కువగా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నాగానీ ఒక స్థిరమైన ఫార్ములా ప్రకారమే ఈ వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ ఉంటామని వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu