ఇవేం మద్యం బ్రాండ్లు సీఎం..  బ్యాలెట్ బాక్సులో లేఖ..

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమలులో ఉన్న మద్యం పాలసీపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చాకా గతంలో ఉన్న పాలసీని మార్చేసింది. ప్రస్తుతం ప్రభుత్వమే షాపులను నిర్వహిస్తోంది. లిక్కర్ బ్రాండ్లను కూడా మార్చేశారు. కొత్త రకం బ్రాండ్లను ఏపీలో అందుబాటులోకి తెచ్చింది. అయితే కొత్తగా తీసుకువచ్చిన బ్రాండ్లు నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నా.ి, దీనిపై మందుబాబుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రేట్లను అడ్డుగోలుగా నిర్ణయిస్తూ నాసిరకం లిక్కర్ ను అంటగడుతున్నారనే కొందరు బహిరంగంగానే మండిపడ్డారు.

తాజాగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులోనూ మద్యం బ్రాండ్లపై జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో బయటపడింది. ఓటుతో పాటు బ్యాలెట్ బాక్సులో  చీటి ఏపి సర్కారుకు ఓ మందుబాబు చేసుకున్న  విన్నపం ఆసక్తిగా మారింది. అనంతపురం జిల్లా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కంపు నేపథ్యంలో బ్యాలెట్‌ బాక్స్‌లో వచ్చిన ఓ మందు బాబు విన్నపం అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచింది.రకరకాల మద్యం బ్రాండ్లతో విసుగెత్తి పోతున్నామని, ఇప్పుడు సరఫరా చేసిన బ్రాండ్లను మార్చాలంటూ ఒక ఓటరు తన ఓటుతో పాటు చీటీ రాసి బ్యాలెట్‌ బాక్సులో వేశారు.

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్లపల్లి ఎంపీటీసీ పరిధిలోని బ్యాలెట్‌ బాక్సులో ఈ చీటీ బయటపడింది. మద్యం దుకాణాల్లో చల్లని బీర్లతో పాటు మంచి బ్రాండ్‌ ల మద్యాన్ని అందుబాటులో ఉంచాలని చీటీలో మందుబాబు పేర్కొన్నాడు. బ్యాలెట్‌ బ్యాక్సులు ఓపెన్‌ చేసి ఓట్లను లెక్కిస్తున్న క్రమంలో ఈ చీటీలు బయటపడ్డాయి. నల్లచెరువు మందుబాబుల యూత్‌ అధ్యక్షుడు అని రాసి ఉండటం కొసమెరుపు.చీటీలో నల్లచెరువు మందుబాబుల యూత్‌ అధ్యక్షుడు అని రాసి ఉండటం కొసమెరుపు.