నారాయణ చెప్పిన ఒకే ఒక్క మాట!
posted on May 11, 2017 10:30AM
.jpg)
ఏపీ మంత్రి నారామణ తనయడు నిశిత్ నారాయణ నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. నిశిత్ మరణంతో నారాయణ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. నిశిత్ మరణ వార్తను నారాయణకు తెలిపిన వెంటనే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఆయన వెంటనే బయలుదేరి వచ్చేశారు. ఇవాళ ఉదయం 4గంటలకు నెల్లూరు చేరుకున్న ఆయన కుమారుడి పార్థివదేహం చూసి ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ విలపించారు. ఆయన వెంట వున్న మంత్రులు, కుటుంబసభ్యులు నారాయణను ఓదార్చగా... "దేవుడు చేసిన అన్యాయమిది. మనమేం చేయలేము" అంటూ ఆయన ఒకే ఒక మాట పలికారు. ఇదిలా ఉండగా నిశిత్ భౌతికకాయాన్ని చూడటానికి పలువురు రాజకీయ నేతలు, వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు మినహా, మిగతా అందరు ఏపీ మంత్రులు నెల్లూరు వచ్చారు. కాగా నారాయణ కళాశాల నుంచి బోడిగాడితోటలోని శ్మశానవాటిక వరకు 8 కిలోమీటర్ల మేర సాగే అంతిమ యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెదేపా నేతలు పాల్గోనున్నారు.