నిశిత్ నారాయణ మెడికల్ రిపోర్ట్.. తాగలేదు...అందుకే చనిపోయాడు..
posted on May 10, 2017 12:38PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో నిశిత్ నారాయణతో పాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ కూడా మృతి చెందాడు. అయితే ఇప్పుడు వీరి మృతిపై అపోలో ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు సురేందర్‌రెడ్డి వైద్య నివేదిక వెలువరించారు. ‘అతివేగంతో పిల్లర్‌ను ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని.. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే చనిపోయి ఉంటారని తెలిపారు. అంతేకాదు నిశీత్, రవిచంద్ర మద్యం సేవించలేదు... బలమైన దెబ్బలు తగలడంతోనే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న నిశీత్ ఛాతికి స్టీరింగ్ బలంగా తాకడంతో...ఊపిరిపితిత్తులు దెబ్బతిన్నాయి..లివర్ ముక్కలైంది’ అని వైద్యులు తెలిపారు.