ఏపీలో బూట్ల కొలతల కోసం బడికి.. పిల్లల ప్రాణాలతో చెలగాటం!

కరోనా విజృంభిస్తోంది. ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం ఈ హెచ్చరికలను గాలికి వదిలేస్తున్నారు. బూట్ల కొలత పేరుతో విద్యార్థులను పాఠశాలలకు రప్పిస్తూ.. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

జగనన్న విద్యా కానుక లో భాగంగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు బూట్లు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బూట్ల పంపిణీ చేయడానికి విద్యార్థులను స్కూళ్లకు రప్పించి పాదాల కొలతలు తీసుకోవాలంటూ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. కరోనా కారణంగా స్కూళ్లు తెరవక పోయినా.. బూట్ల కొలత కోసం విద్యార్థులను పిలిపించారు. కొలతలు ఇవ్వడానికి విద్యార్థులంతా స్కూళ్లకు క్యూ కట్టారు. ఉపాధ్యాయులు పాదాల కొలతలను తీసుకుంటున్నారు. అయితే, కరోనా విజృంభిస్తోన్న వేళ.. ఇలా విద్యార్థులను గుంపులుగా స్కూళ్లకు రప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu