అమరావతిని లండన్, పారిస్ లా కట్టాలని ఉంది, కానీ...

 

 

జగన్ నాయకత్వం లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాజధాని అమరావతి నిర్మాణం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధానిని జగన్ అక్కడే కొనసాగిస్తారా లేక వేరే చోటికి మారుస్తారా అని రాజధానికి భూములు ఇచ్చిన రైతుల దగ్గర నుండి సామాన్యుల వరకు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అమరావతి నిర్మాణం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్రభుత్వ ప్రాధాన్యత విద్యార్థులకు మంచి చదువు అలాగే ప్రజలకు మంచి వైద్యం అందించటం అని తెలిపారు.  ఈ రెండు ప్రధాన అంశాలను గాలికి వదిలేసి రాజధాని నిర్మాణం పై పడలేమని అయన అన్నారు. ప్రభుత్వానికి కూడా రాష్ట్ర రాజధాని అమరావతిని లండన్, పారిస్ లా నిర్మించాలని ఉందని కానీ ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యం కాదని బుగ్గన స్పష్టం చేశారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News