బీజేపీలో టీడీపీ విలీనం: టీడీపీ ముఖ్య నేత సంచలన కామెంట్స్
posted on Jul 10, 2019 7:16PM

టీడీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి టీడీపీ, బీజేపీల పై సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలోనే టీడీపీ బీజేపీ లో విలీనమౌతుందని అయన సెన్సషనల్ వ్యాఖ్యలు చేశారు. టీడీపీనే బీజేపీతో తాళి కట్టించుకుంటుందని అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కి చంద్రబాబు ఐడియాలు అవసరమని అన్నారు. ఈ సందర్బంగా రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అయన గుర్తు చేశారు. గత ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం తరువాత జేసీ బ్రదర్స్ బీజేపీలోకి జంప్ చేస్తారని ప్రచారం జరిగింది. అలాగే చంద్రబాబు అనంతపురం పర్యటన జరిగిన మర్నాడే జెసి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సాధారణంగా జెసి దివాకర్ రెడ్డి ఇటువంటి పొలిటికల్ కామెంట్లు చేస్తుంటారు, కానీ తాజాగా జెసి ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీలో చర్చ జరుగుతోంది.