పండుగ వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆనందహేల

సంక్రాంతి పండుగ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డబుల్ ఆనందం తీసుకువచ్చింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వోద్యుగులు, పెన్షనర్స డీఏ, డీఆర్ బకాయిలను వారి ఖాతాలో జమ చేసింది. వీరితో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించింది. ఇందు కోసం 26 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వారి వారి ఖాతాలలో జమచేయడం వల్ల ఒక్కొక్కరి ఖాతాలో 30 నుంచి 60 వేల వరకూ జమ అయ్యాయి. ప్రభుత్వం ఈ బకాయిలను సరిగ్గా భోగి పండుగ రోజున విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలలో  సంక్రాంతి సంతోషం రెట్టింపైంది.  

దాదాపు ఆరేళ్ల తరువాత ఈ బకాయిలు విడుదలయ్యాయి.    అలాగే పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. న  పండగ పూట బకాయిలు జమ కావడంతో ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu