దానిపై మాకూ అంతే హక్కుంది.. చంద్రబాబు

 

హైదరాబాద్ పై తెలంగాణకు ఎంత హక్కు ఉందో ఆంధ్ర రాష్ట్రానికి కూడా అంతే హక్కు ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ ఏదో సమస్య సృష్టిస్తూ.. లేనిపోని వివాదాలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి చాలా నష్టం జరిగిందని కట్టుబట్టలతో హైదరాబాద్ నుండి వచ్చేశామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కొట్లాడితే వచ్చేది ఏమీ లేదన్నారు. తనకు ఎవరితోను రాజీపడాల్సిన అవసరం లేదని, నా విశ్వసనీయతనే తనకు శ్రీరామ రక్ష అన్నారు. ఏపీకీ ప్రత్యేక ప్యాకేజీ.. ప్రత్యేక హోదా రెండూ ఇవ్వాలని కేంద్రాన్ని కోరానని.. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ది చెందే వరకూ కేంద్రం సహరించాలని కోరానని చెప్పారు. ఎవరూ ఆధైర్యపడవద్దని, అందరం కలిసి సాధించుకుందామని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu