వాన దేవుడిపై కేసు పెడదాం.. ఏపీ మంత్రి కామెంట్లతో రచ్చ..

ఆంధ్రప్రదేశ్ లో వరదలు బీభత్సం స్పష్టించాయి. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు , ప్రకాశం జిల్లాలో అపార నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా.. వందలాది గ్రామాలు కొన్ని రోజుల పాటు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. వర్షాకాలం కంటే ముందే ఏపీలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలే కనిపించాయి. జగన్ సర్కార్ కనీసం మరమత్తులు కూడా చేయించలేకపోయింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రోడ్ల పరిస్థితి భారీ వర్షాలతో మరింత దారుణంగా తయారైంది. ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి. 

అధికార పార్టీ నేతలకు ఎక్కడికి వెళ్లినా జనాల నుంచి రోడ్లపై నిలదీతలు ఎదరవుతున్నాయి. రోడ్ల దుస్తితిపై  మంత్రులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు ప్రజలు. రోడ్లకు ఎప్పుడు రిపేర్లు చేయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల గురించి అడిగిన జనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు రోడ్లు వేస్తే త్వరగా పాడవుతాయి. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్లు వేస్తామంటూ ప్రకటన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. 

ఏపీ రోడ్లు ఏంటిలా అధ్వానంగా ఉన్నాయి సార్? అని ప్రశ్నించిన పాపానికి నారాయణస్వామి విచిత్రమైన రీతిలో రియాక్టు అయ్యారు. అంతేకాదు తప్పంతా దేవుడిపై వేశారు. దేవుడిపై కేసు పెడదామంటూ కామెంట్ చేశారు. ‘‘ఇదంతా ఆ వానదేవుడి తప్పు.. వర్షాలు బాగా కురుస్తున్నందునే రోడ్లు బాగా చెడిపోతున్నాయి. ఏదైనా కేసు పెట్టాలంటే ఆయనపైనే పెట్టటండి’’ అంటూ కామెంట్లు చేశారు నారాయణ స్వామి. అక్కడితో ఆగని ఆయన విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వం నాణ్యత లేని రోడ్లు వేసి దోచుకుందని, వరుణ దేవుడు కూడా వారికి బుద్ధి రావటానికి రోడ్లను ఇలా పాడు చేశారన్నారు. అంతేకాదు చంద్రబాబు దుష్టపాలనకు చెక్ చెప్పేందుకే భగవంతుని స్వరూపంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు నారాయణ స్వామి.

డబ్బులు కడతారా.. పింఛన్‌, రేష‌న్‌ ఆపేయాలా?.. ‘జగనన్న సంపూర్ణ గృహ దోపిడీ’

రోడ్లు బాగా లేకపోవటానికి కారణం కంటికి కనింపిచని వరుణదేవుడు.. కంటి ముందు ఉండే చంద్రబాబు తప్పించి.. జగన్ ప్రభుత్వ తప్పేమి లేదన్నట్లుగా నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా రాజకీయాల్లో అధినేతను పొగడ్తలతో ముంచెత్తటం మామూలే అయినా ఈ స్థాయిలో పొగడటం మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామికే చెల్లుతుందని చెప్పాలి. ఇటీవల కాలంలో ఆయన ఎక్కడ మాట్లాడినా జగన్ కు ఆకాశానికెత్తేస్తున్నారు. చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. దీంతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తన పదవి పోకుండా ఉండటానికే నారాయణ స్వామి ఇలా జగన్ భజన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu