కొవిడ్ ముప్పు ముగిసిందా? ఎండెమిక్‌లా మారిపోనుందా? ఒమిక్రాన్ అదేనా?

ఆల్ఫా, బీటా, డెల్టా.. ఇప్పుడు ఒమిక్రాన్‌. వేరియంట్‌లు మారుతున్నాయి. కేసుల సంఖ్య మారుతోంది. ముప్పు సైతం త‌గ్గుతోంది. ఆఫ్రిక‌న్ కంట్రీలో పురుడుపోసుకున్న ఒమిక్రాన్ ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. క‌ల‌వ‌ర‌మైతే ఉంది కానీ, మునుప‌టిలా భ‌యం మాత్రం లేదు. టెస్టు చేస్తేనే కొవిడ్ పాజిటివ్ అని తేలుతోంది. లేదంటే లేదు. కొద్దిమందిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉంటున్నాయి. అంటే, క‌రోనాతో పోయిన‌ట్టేనా? వ్యాక్సినేష‌నే ఇందుకు కార‌ణ‌మా? లేక‌, స‌మాజంలో హ‌ర్డ్ ఇమ్యూనిటీ ఏర్ప‌డిందా?  సాధార‌ణ జ‌లుబు, ఫ్లూ మాదిరే.. కొవిడ్ సైతం ఎండెమిక్ స్థాయికి ప‌డిపోయిందా? అనే చ‌ర్చ మొద‌లైంది.  

ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు ప‌ని చేస్తాయా? మూడో డోస్ అవ‌స‌ర‌మా? వైరాల‌జిస్ట్ వివ‌ర‌ణ‌.. 

ఒమిక్రాన్‌ వేరియంట్‌ పుట్టుక.. ఎండెమిక్ ప్రక్రియ దిశగా మొదటి అడుగు కావొచ్చని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. తక్కువ లక్షణాలు ఉంటే విస్తృతి అధికం. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటే ప్రజలు నిర్ధారణ పరీక్షలకు ముందుకు రాకపోవచ్చు. తమకు కొవిడ్‌ సోకిందనే విషయాన్నే గుర్తించలేరు. అందువల్ల ఒమిక్రాన్‌ ఉద్ధృతి అధికంగా ఉంటోంది. అయితే, కొత్త వేరియంట్‌ ఏ జనాభాలో ఉత్పన్నమైందన్నది కూడా ముఖ్య‌మైన విష‌య‌మే. ఒమిక్రాన్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్‌ రేటు 25 శాతంగానే ఉంది. అలాంటి చోట్ల ‘ఆర్ ఫ్యాక్ట‌ర్‌’ ఎక్కువగా ఉన్న రకాలు ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఉంటుంది. విస్తృత స్థాయిలో టీకా పొందిన జనాభాలో.. వ్యాక్సిన్‌ను ఏమార్చే రకాలు పైచేయి సాధించొచ్చు.     

డబ్బులు కడతారా.. పింఛన్‌, రేష‌న్‌ ఆపేయాలా?.. ‘జగనన్న సంపూర్ణ గృహ దోపిడీ’

మునుపటి రకాలతో పోలిస్తే వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని చాటే కొత్త వేరియంట్లు బాగా విస్తరిస్తాయని పరిణామక్రమ జీవశాస్త్రం చెబుతోంది. ‘ఆర్ ఫ్యాక్ట‌ర్‌’ (వ్యాధి సోకిన వ్యక్తి నుంచి సరాసరి ఎంతమందికి ఆ వైరస్‌ వ్యాపిస్తుందో చెప్పే సంఖ్య) అధికంగా ఉన్న రకాలు.. తక్కువగా ఉన్న వేరియంట్ల స్థానాన్ని ఆక్రమిస్తాయి. ప్ర‌స్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను అడ్డుకోగ‌లిగితే.. ఇక ఎండెమిక్ స్థాయి త్వ‌ర‌లోనే ఆవిష్కృతం అవుతుంద‌ని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే, డేంజ‌ర‌స్ క‌రోనా వైర‌స్ అంత ఈజీగా త‌లొగ్గుతుందా? లేక‌, వ్యాక్సిన్‌ను ఏమార్చే శ‌క్తితో మ‌రింత బ‌లం పుంజుకుంటుందా? అనేది కాల‌మే డిసైడ్ చేయాలి.

వైసీపీ వారికే వరద సాయం? కడప జిల్లాలో బాధితుల ఆందోళన..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu