ఆంధ్రా ఛాయిస్ "చంద్రబాబే"
posted on Apr 15, 2016 3:20PM
.jpg)
పరిస్థితులు మారినా..పరిణామాలు మారినా ఆంధ్రా వాయిస్ ఒక్కడే..ఛాయిస్ ఆ ఒక్కడే. ఆ ఒకేఒక్కడు నారా చంద్రబాబు నాయుడు. కేంద్రప్రభుత్వ సంస్థలు..వేల కోట్ల ఆస్తులు..హైదరాబాద్ ..ఆదాయం..పాతాళంలా కనిపించే రెవెన్యూ లోటు అన్ని పోయినా..ఒక్కటే ఆశ. ఒక్కడున్నాడన్న భరోసా..బాబున్నాడు ఆయన చూసుకుంటాడు. పొగడ్తలా అనిపించినా..ఇదే వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి తదితర అంశాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ గతనెల రెండో వారం నుంచి పదిరోజుల పాటు ఏపీలో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో రాష్ట్ర ప్రజలందరూ మా ఛాయిస్ ఎప్పటికీ బాబే అని స్పష్టం చేశారు.
సర్వేలో తేలిన విషయాలు:
* ఏపీ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతో తప్ప మరో వ్యక్తికి సాధ్యం కాదని 67% మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
* బాబు నాయకత్వంలో రాష్ట్రంలో మతసామరస్యం చక్కగా ఉందని 61% మంది తెలిపారు.
* రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ముఖ్యమంత్రి సమ ప్రాధాన్యం ఇస్తున్నారని 54% మంది వెల్లడించారు
ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికి కొంత వ్యతిరేకత కూడా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బాగానే కష్టపడుతున్నప్పటికి, ఆ ఫలితాలు మాత్రం మాకు అందడం లేదని చాలా మంది ప్రజలు వ్యక్తం చేశారు. చంద్రబాబు స్థాయిలో ఆయన కేబినెట్‌లో మంత్రులు పని చేయడం లేదని తేలింది. బాబు ఎంత కఠినంగా వ్యవహరించినా అవినీతి మాత్రం తగ్గడం లేదని 39% మంది అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నంత స్థాయిలో చంద్రబాబుపై వ్యతిరేకత లేదని అర్థమైంది.