ఏపీ అసెంబ్లీ.. అవిశ్వాసం తీర్మానంపై చర్చ.. తీర్మానం ఎందుకు పెట్టారు..?
posted on Mar 14, 2016 1:16PM

ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది.. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది అని అన్నారు. ఇంకా పలువురు మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి
అవిశ్వాస తీర్మానం ఒక్క సభ్యుడైన పెట్టొచ్చు.. పేపరు మీద సంతకం చేసిన వాళ్లే మాట్లాడాలనుడం సరికాదు.. రాష్ట్రంలో కుళ్లు, కుతంత్ర రాజకీయాలు నడుస్తున్నాయని.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు.. ఈ రోజే అవిశ్వాసంపై చర్చకు ఎందుకు అనుమతించారు అని ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్ష నేతకు అవగాహన లేదని అన్నారు. జగన్ పై విశ్వాసం లేకే వైసీపీ నేతలు టీడీపీలో చేరారని వ్యాఖ్యానించారు. ఎందుకు అవిశ్వాసం పెట్టారో వైసీపీ చెప్పాలి అంటూ.. పోలవరానికి అడ్డంకులు తొలగించాం అందుకా.. పెన్షన్లను ఐదు రెట్లు పెంచినందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారా అంటూ ప్రశ్నించారు.