బాహుబలికి పోటీగా అనుష్క దేవసేన
posted on Nov 7, 2013 9:02AM

"అరుంధతి" చిత్రంతో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ అనుష్క పుట్టినరోజు నేడు. అనుష్క ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "బాహుబలి" చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో అనుష్క దేవసేన పాత్రలో కనిపించబోతుంది. అయితే అనుష్క పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్రంలో అనుష్క ఎలా ఉంటుందనే ఊహాగానాలకు మరింత పెంచే విధంగా ఓ మేకింగ్ వీడియో ను విడుదల చేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ వీడియోలో కేవలం అనుష్క మాత్రమే కనిపించేలా తయారుచేశారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి అనుష్క పుట్టినరోజు సంధర్భంగా తనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన్.కామ్