యూపీలో కర్నాటక ఐఏఎస్ అనుమానాస్పద మృతి

కర్నాటక కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ఉత్తరప్రదేశ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉదయం లక్నోలోని హజ్రత్‌గంజ్ మీరాబాయి అతిథి గృహానికి సమీపంలోని రోడ్డు పక్కన ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ పడివున్న వస్తువులు, గుర్తింపుకార్డుల సాయంతో మరణించిన వ్యక్తిని ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారిగా తేల్చారు. యూపీలోని బహర్చి అనురాగ్ స్వగ్రామం..ఆయన 2007 కర్నాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. తివారి రెండు రోజుల నుంచి మీరాబాయి అతిథి గృహంలో ఉంటున్నారు. మృతదేహానికి దవడ వద్ద గాయం ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu