ఎన్టీఆర్, అనూప్ 'రభస'
posted on May 25, 2013 4:33PM
.jpg)
టాలీవుడ్ లో చిన్న హీరోలకి వరుస విజయాలు అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ 'అనూప్ రూబెన్స్'. ఈ సమ్మర్ లో సర్ ప్రైజ్ హిట్ 'గుండెజారి గల్లంతయిందే' అనూప్ మ్యూజిక్ కి మేజర్ షేర్ వుంది. ఇదికాక ఇష్క్, పూలరంగడు, ప్రేమ కావాలి వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించాడు. ఇప్పుడు అవే అతనికి పెద్ద సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ నటిస్తున్నా 'మనం' సినిమాకి అనూప్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఇతనికి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఎన్టీఆర్, సమంత జంటగా కందిరీగా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో మొదలుకానున్న 'రభస' కి అనూప్ మ్యూజిక్ అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సినిమాతో అనూప్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల సరసన చేరడం ఖాయం అంటున్నారు.