ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి కుట్ర
posted on Aug 19, 2025 8:45PM

నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణా రెడ్డిపై హత్యాయత్నం కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. అన్నవరంలోని గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరుల హల్చల్ చేసినట్లు టాక్. డ్రోన్ లతో వీడియోలు తీస్తున్న వేణు, వినోద్ అనే మాజీ ఎమ్మెల్యే అనుచరులు. వీరికి క్రషర్స్ పాయింట్ ని చూపించిన దామెర్ల శ్రావణ్ అనే వ్యక్తి డ్రోన్ లతో వీడియోలు తీసి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు దుండగుడు.
ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.స్థానికులు, క్రషర్ వద్ద సిబ్బంది వారిని ప్రశ్నించడంతో కత్తులతో దాడికి దిగిన వేణు,వినోద్ ..క్రషర్ శివార్లలో కారు వేసుకుని రెక్కీ నిర్వహిస్తున్న గుర్తుతెలియని నలుగురు దుండగులు. పోలీసులు విచారణలో తమని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పంపించారని,ఎవరు అడ్డొచ్చినా ఏదైనా చేయమని చెప్పారని నిందితులు ఒప్పుకున్నరని తెలుస్తోంది.ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డిని హత్య చేసేందుకు కావలిలో సుఫారి గ్యాంగ్ దిగినట్టు సమాచారం.