చెత్త బుట్టలోకి చెత్తపన్ను

చంద్రబాబు సర్కార్ చెత్త పన్నును రద్దు చేసింది. జగన్ హయాంలో 2012 నవంబర్  నుంచి రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ సర్కార్ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించి.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.

ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో చెత్తపన్నును రద్దు చేస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  గత ఏడాది డిసెంబర్ 31నుంచీ చెత్త పన్ను రద్దు అమలులోకి వచ్చినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొంది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్నును రద్దు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu