ఆంధ్ర-తెలంగాణ రాకపోకలు బంద్..!

భారీ వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ సరిహద్దులో వున్న పాలేరు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బ్రిడ్జిపై రాకపోకలు పోలీసులు నిలిపివేశారు. వరద ఉద్ధృతికి జాతీయ రహదారి కోసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu