తెలంగాణలో రైల్వే ట్రాక్ ధ్వంసం

posted on: Sep 1, 2024 10:39PM

భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో కూడా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామం సమీపంలో చెరువు కట్ట తెగడంతో ఇంటెకన్నె - కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దాంతో విజయవాడ - కాజీపేట మార్గంలో పలు రైళ్ళు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ ఎగువ, దిగువ మార్గాల్లో కంకర కొట్టుకునిపోయింది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...