విపత్తు నిధులలో ఏపీకి సింహ భాగం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మాటకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నది. ఆయన విజ్ణప్తుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నది. బడ్జెట్ కేటాయింపులలోనూ, అమరావతి, పోలవరం లకు సహకారం విషయంలోనూ ఈ విషయం ఇప్పటికే ధృవపడింది.

తాజాగా కేంద్రం విడుదల చేసిన విపత్తు, వరదల సహాయం నిధుల విషయంలోనూ ఏపీకి సింహభాగం దక్కింది. కేంద్రం తాజాగా ఐదు రాష్ట్రాలకు కలిపి విపత్తు, వరదల సహాయం కింద1,554.99 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులలో అత్యధికంగా ఏపీకి 608.08 కోట్ల రూపాయలు కేటాయించింది.  ఇక మిగిలిన రాష్ట్రాలలో తెలంగాణకు  231 కోట్ల రూపాయలు, త్రిపురకు  288.93 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అలాగే ఒడిశాకు 255.24, నాగాల్యాండ్ కు 170.99 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu