ముడా కేసులో పీచేముఢ్.. కర్నాటక సీఎంకు లోకాయుక్త క్లీన్ చిట్

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ  (ముడా) స్థల కేటాయింపుల వ్యవహారంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లోకాయయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో  కర్ణాటక ముఖ్యమంత్రి   సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని లోకాయుక్త పేర్కొంది. ఈ మేరకు పోలీసుల ఇప్పటికే హైకోర్టుకు తిది నివేదిక సమర్పించినట్లు లోకాయుక్త పోలీసులు తెలిపారు. త ఈ కేసులో సిద్ధరామయ్య  , ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.  

ఈ కేసులో సిద్ధరామయ్య భార్య పార్వతికి ముడా అధిక విలువ ఉన్న ప్రాంతంలో స్ధలాలు కేటాయించిందన్న ఆరోపణలు ఉన్నాయి.   ప్రస్తుత నివేదికలో.. పార్వతికి కేటాయించిన స్థలంపై అనుమానాలు ఉన్నా.. ఆమె వద్ద 3.16 ఎకరాల భూమికి చట్టపరమైన హక్కులున్నాయా? లేదా? అనే అంశంపై ఇంకా విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.  లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఈడీ మాత్రం ఈ కేసులో దర్యాప్తు కొనసాగించనుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu