ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. జగన్ పై కేసు
posted on Feb 20, 2025 11:55AM

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆంక్షలను ఉల్లంఘించి, నియమావళిని పట్టించుకోకుండా జగన్ బుధవారం (ఫిబ్రవరి 19) గుంటూరు మిర్చియార్డ్ లో పర్యటించిన సంగతి విదితమే. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కనుక మిర్చియార్డ్ పర్యటనకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినా, పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించినా జగన్ లేక్క చేయకుండా మిర్చియార్డు ను సందర్శించి అక్కడ ప్రసంగించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే జగన్ పై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈసీ, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై కూడా కేసు నమోదైంది.