తిరుపతికి పవన్ కల్యాణ్..తొక్కిసలాటలో గాయపడిన వారికి పరామర్శ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం (జనవరి 9) మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఈ దుర్ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖకు సూచించిన పవన్ కల్యాణ్ బాధితులను స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu