జూన్ 6న రాజధానికి భూమిపూజ

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6న రాజధానికి కేవలం భూమిపూజ మాత్రమే చేస్తుందని, శంఖుస్థాపన కాదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు తెలిపారు. దసరా పండుగ సమయంలో రాజధానికి శంఖుస్థాపన చేసి వెంటనే నిర్మాణపనులు ఆరంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులను అనేకమంది ప్రముఖులను ఆహ్వానించి, ప్రధాని చేతుల మీదుగా శంఖుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈనెలాఖరులోగా సింగపూర్ సంస్థ నుండి రాజధాని మాష్టర్ ప్లాన్ చేతికి అందుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్న తుళ్ళూరు మండలంలో మందడం-తాళ్లాయపాలెం మధ్య భూమిపూజ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.