పార్టీలో ఉండాలా? వెళ్లిపోవాలా?
posted on Aug 19, 2015 1:22PM
.jpg)
పార్టీలో ఉండాలా పోవాలా అంటూ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డిని ప్రశ్నించారు. ఇంతకీ ఏ విషయంలో వివేకానంద రెడ్డికి అంత కోపం వచ్చిందంటే చింతా మోహన్, పనబాక లక్ష్మీ చెప్పిన వారికే పదవులు ఇవ్వడంతో ఆనం రఘువీర రెడ్డి మీద ఫైర్ అయ్యారు. దీని కారణం ఏంటంటే నెల్లూరు జిల్లాలోని సేవాదళ్, ఎస్సీ కమిటీ జిల్లా అధ్యక్ష పదవులను చింతా మోహన్, పనబాక లక్ష్మీ వారికి ఇవ్వడం.. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇందిరా భవన్‌లో ఆనం రఘువీరా రెడ్డిని కలిసి నెల్లూరు జిల్లాలో తమ పరువు ఉండాలా?.. పార్టీకి పట్టుమని పది మందిని కూడా తీసుకువచ్చే సామర్థ్యం లేని ఇలాంటి వారికి పదవులు ఇస్తే పార్టీ బతుకుతుందా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకొని వారిని తొలగిస్తే సరి లేకపోతే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాదు ఇప్పటికే పార్టీ చాలా కష్టాల్లో ఉంది ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం పార్టీకే మంచిది కాదని అన్నారు. అయినా ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటే మేమేందుకు.. మేము పార్టీలో ఉండాలా? వెళ్లిపోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.