జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వ చేపట్టిన భూసేకరణపై వ్యతిరేకత చూపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై భూసేకరణ వద్దంటూ ట్వీట్స్ చేశాడు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దని.. ఈ విషయంపై సీఎం చంద్రబాబు మరోసారి ఆలోచించాలని ట్వీటారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడితోపాటు నదికి సమీపంలో ఉన్న గ్రామాలను భూసేకరణ నుంచి మినహాయించాలని పవన్ చంద్రబాబును కోరారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీకి మిత్రపక్షమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ గవర్నమెంట్ పై ఈ విషయంలో టీడీపీకి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. మరి పవన్ కళ్యాణ్ ట్వీట్లకు చంద్రబాబు స్పందిస్తారో లేదో చూడాలి.