ట్రంప్ విధానాలతో అమెరికా దివాళా.. మొట్టికాయలు వేసిన అప్పీళ్ల కోర్టు!

భార‌త్ అంటే భ‌గ్గుమంటున్నారు ట్రంప్. అంతేనా  ఇండియాపై  యాభై శాతం సుంకాల మోత మోగిస్తున్నారు. దీంతో  భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవ్వాల్సిన సరుకంతా  ఇండియాలోనే డెడ్ చీప్ గా అమ్ముకుని అస‌లైనా స‌రే రాబ‌ట్టుకోవాల్న ఆలోచన చేస్తున్నారు మన వ్యాపారులు.   2024- 25 నాటికి భార‌త్ యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 131 బిలియ‌న్ డాల‌ర్లు కాగా.. దీనిని  2030 నాటికి 500 బిలియ‌న్ డాల‌ర్లకు పెంచాలని  ఇరు దేశాలూ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈలోగా ట్రంప్ రెండో సారి పీఠ‌మెక్క‌డంతో ప్ర‌పంచంలో ఉన్న అన్ని దేశాల‌ కంటే  భార‌త్ నే   టార్గెట్ గా పెట్టుకున్నారు ట్రంప్.  ప్ర‌స్తుతం అమెరికాలో కంపెనీలకు సీఈఓలుగా, ఇత‌ర ఉన్న‌త స్థానాల్లో ఉన్న భార‌తీయుల నుంచి మొద‌లు పెడితే.. సాదా సీదా ఉద్యోగుల వ‌ర‌కూ అందరినీ  అమెరిక‌న్ కంపెనీలు తొల‌గించాల‌ని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇక్క‌డ వాస్త‌వ ప‌రిస్థితి చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికాలో అమ్ముడు పోతున్న ఐఫోన్లు స‌గానికి స‌గం భార‌త్ లో త‌యార‌వుతున్న‌వే.

అలాగే.. భార‌త్ వ‌ల్ల ఏయే అమెరిక‌న్ కంపెనీలు, ఎంతేసి లాభాలు పొందుతున్నాయో.. లిస్ట్ చూస్తే గూగుల్, మెటా అమేజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఏటా భార‌త్ డిజిట‌ల్ రంగం నుంచి 15 నుంచి 20 బిలియ‌న్ డాల‌ర్ల మేర ల‌బ్ధి పొందుతున్నాయి. అదే విధంగా  మెక్ డొనాల్డ్, కోకాకోలా స‌హా ఇత‌ర కంపెనీలు ఇక్క‌డి నుంచి మ‌రో 15 బిలియ‌న్ డాల‌ర్ల మేర సంపాదిస్తున్నాయి.  జేపీ మోర్గాన్, మెక‌స్సీ, గోల్డ్ శాక్స్ వంటి వాల్ స్ట్రీట్ ఫైనాన్షియ‌ల్ క‌న్సెల్టెన్సీలు కేవ‌లం ఫీజుల రూపంలోనే 15 బిలియ‌న్ డాల‌ర్ల మేర వెన‌కేస్తున్నాయ్.  ఇక ఔష‌ధ రంగ పేటెంట్లు, హాలీవుడ్ సినిమాలు, స్ట్రీమింగ్ స‌ర్వీసులు, ర‌క్ష‌ణ ఒప్పందాల నుంచి వ‌చ్చే ఆదాయం   అద‌నం. 

ఇదే కాకుండా సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది భార‌తీయ విద్యార్ధులు ఏటా అమెరికాలో పై చ‌దువుల పేరిట అక్క‌డికి వెళ్లి పెడుతున్న ఖ‌ర్చు అక్ష‌రాలా 25 బిలియ‌న్ డాల‌ర్లు. దీన్నిబ‌ట్టీ చూస్తే భార‌త్ అమెరికా నుంచి ఏటా 85 బిలియ‌న్ డాల‌ర్ల మేర ఎగుమ‌తుల రూపేణా పొందుతుంటే.. అంతే స‌మాన స్థాయిలో మ‌న నుంచి ఏదో ఒక రూపంలో  లబ్ధిం పొందుతోంది అమెరికా. 

ఈ లెక్క‌న మ‌నం కూడా ట్రంప్ లాగే.. వ్యవహరిస్తే.. దెబ్బ‌కు దెబ్బ..చెల్లుకు చెల్లు అన్నట్లుగా స‌రిపోతుంది. దీంతో గ్లోబ‌ల్ మార్కెట్ దాదాపు స్ట్ర‌క్ అయిపోతుంది. ఈ విష‌యం గుర్తించ‌ని ట్రంప్ పిచ్చిపిచ్చి నిర్ణ‌యాలు తీసుకుంటూ.. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను దివాళా తీయిస్తున్నారని సాక్షాత్తూ అమెరికా అప్పీళ్ల కోర్టు అక్షింతలు వేసింది. ట్రంప్ నిర్ణయాలను తప్పుపట్టింది. అయితే ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించి  త‌న పంతం నెగ్గించుకునే ప‌నిలో బిజీగా ఉండ‌టంతో.. పాపం ఈ కంపెనీల‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ట‌. మ‌నం ఎలా చేశామో స‌రిగ్గా భార‌త్ కూడా అదే చేస్తే.. మా ఆద‌యం ఏం కాను దేవుడా అంటూ   గుండెలు బాదుకుంటున్నాయట‌!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu