నీలోనే అల్లా ఉన్నాడు...మద్యంలో సైతాను ఉన్నాడు

ఫిరోజ్ వ్యసనాలను అలవాటు పడ్డాడు. తాను మనసులో ఏది తల్చుకుంటే  అది నిమిషాల్లో కావాలంటాడు. తల్లి దండ్రులకు ఇది నచ్చలేదు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఒక  రోజు ఫిరోజ్ ను తీసుకుని తల్లిదండ్రులు మౌలానా దగ్గరకు వచ్చారు. 
 ఫిరోజ్ తల్లిదండ్రులు: సలాం వాలేకూం మౌలానా
మౌలానా: వాలేకుం సలాం, కైరియత్ 
ఫిరోజ్ తల్లిదండ్రులు: అల్  హమ్ దు లిల్లా మౌలానా సాబ్ ఫిరోజ్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు . ఉద్యోగం సద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. 
మౌలానా: ఇస్లాంలో మద్యం సేవించడం మహా పాపం. మద్యం వ్యసనం వల్ల మనిషి అనేక పాపాలు చేస్తాడు. తాను చేసే పాపాలు కూడా పశ్చాత్తాపం చెందే అవకాశం  కూడా లేదు. నమాజును క్రమ బద్దంగా నిర్వహించాలి.  శుక్రవారం మసీదులకు వచ్చిన యువకులు  చాలామంది తిరిగివెళ్లేటప్పుడు టోపీలను పెట్టుకోవడం లేదు. ఫ్యాషన్ కు అలవాటు పడ్డ యువత అల్లాకు దూరమౌతున్నారు.  మసీదుకు దగ్గరగా ఉన్నవారు సమయానికి మసీదుకు రావడం లేదు. వచ్చినా సమయానికి రావడం లేదు. మొదటి రఖాత్(నమాజు ప్రక్రియలో భాగం) అయి పోయిన తర్వాత వస్తున్నారు. ఆలస్యంగా నమాజు వేళలు పెట్టినప్పటికీ మొదటి రఖాత్ కు రావడం లేదు. రఖాత్ వదిలేయడం మహా పాపం. టైంపాస్ కోసం నమాజుకు వస్తే ఫలితం శూన్యం. అల్లాకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాలి. అప్పుడే చెడు వ్యసనాలు వాటంతట అవే దూరమౌతాయి. నీలోనే అన్నీ ఉన్నాయి. వాటిని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మంచి ఏమిటో చెడు ఏమిటో నీకు తెలుసు. ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో నీకు తెలుసు. నీకు ఎవరో చెప్పాలి అనే నియమం లేదు. నీకు అన్నీ తెలిసినప్పుడు నిర్ణయం తీసుకోవల్సింది నువ్వే. అల్లా   ఎక్కడో లేడు. నీలోనే ఉన్నాడు.  నీలోనే అల్లా ఉన్నప్పుడు పాప పుణ్యాలు కూడా నీవే తెలుసుకుంటావు. నువ్వు అల్లాతో మాట్లాడాలి  అని మనస్పూర్తిగా అనుకుంటే చాలు. నీ సమస్యలను నివేదించాలి అన్నీ మాయమవుతాయి. అల్లా వచ్చి నీతో మాట్లాడతాడు అని మౌలానా తన తక్రీర్ ముగించాడు. 
ఫిరోజ్ తల్లిదండ్రులు: ఖుదాఫీస్ మౌలానా సాబ్ 

                                                                                 బదనపల్లి శ్రీనివాసాచారి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu